పులిపై పగ తీర్చుకున్న రైతు!
- తమిళనాడు నీలగిరి అడవుల్లో వెలుగు చూసిన ఘటన
- తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకున్న రైతు
- అడవిలో పులి సగం తిని వదిలేసిన ఆవు కళేబరానికి క్రిమిసంహారకాల పూత
- అది తిని రెండు పులుల మృతి
- అటవీ శాఖ అధికారులు నిందితుడిని ప్రశ్నించగా బయటపడ్డ కుట్ర
ఈ క్రమంలో ఆ శాంపిళ్లలో క్రిమిసంహారకాలు ఉన్నట్టు బయటపడింది. దీంతో, వారు ఆవు యజమాని శేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే పులిపై ప్రతికారం తీర్చుకున్నట్టు అంగీకరించాడు. పది రోజుల క్రితం తన ఆవును ఓ పులి చంపినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలోనే పులి సగం తిని వదిలిన ఆవు కళేబరానికి పురుగుల మందు పూసి విషపూరితం చేయడంతో ఆ రెండు పులులు మరణించాయని చెప్పుకొచ్చాడు.