రాజు కేసీఆర్, యువరాజు కేటీఆర్ బాగానే ఉన్నా.. సామంతరాజు నన్ను టార్గెట్ చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్

MLA Ramulu Naik Fires on Minister Puvvada Ajay
  • మంత్రి పువ్వాడపై రాములు నాయక్ ఫైర్
  • దళితబంధుపై తానిచ్చిన జాబితాను పక్కనపెట్టారని ఆగ్రహం
  • తనకు టికెట్ రాకుండా చేసినా భరించానన్న ఎమ్మెల్యే
  • తానింకా ఎమ్మెల్యేనన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌పై సొంత పార్టీ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఫైరయ్యారు. తన నియోజకవర్గంలో దళితబంధు పథకానికి సంబంధించి తానిచ్చిన జాబితాను పక్కనపెట్టి వైరా బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ఇచ్చిన జాబితాను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తనకు టికెట్ రాకుండా చేసినా భరించానని, అయినా తనపై పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాదని మదన్‌లాల్‌కు మంత్రి టికెట్ ఇప్పించుకున్నారని ఆరోపించారు. 

రాజు కేసీఆర్, యువరాజు కేటీఆర్ బాగానే ఉన్నా.. సామంతరాజు తనను టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా తనకింకా సమయం ఉందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
MLA Ramulu Nayak
BRS
Puvvada Ajay Kumar

More Telugu News