Mars: అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన నాసా

NASA produces oxygen on Mars
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ఘనతను సాధించింది. అంగారక గ్రహంపై నాసాకు చెందిన మోక్సీ అనే పరికరం ప్రాణవాయువు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియ విజయవంతంగా జరిగిందని నాసా వెల్లడించింది. అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చినట్టు తెలిపింది. భవిష్యత్తులో మార్స్ పైకి మానవులను పంపే మిషన్ లకు ఈ ప్రయోగం ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పింది. అంగారకుడిపై ఉన్న పర్సెవరెన్స్ రోవర్ లో ఓవెన్ పరిణామంలో ఉన్న ఒక యంత్రం ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా అంగారకుడిపై ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది. మోక్సీ ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసిందని తెలిపింది. ఈ ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా ఉందని... ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పింది.
Go Back to Shorts
Mars
Oxygen
NASA

More Telugu News