చేత కాని వాళ్లే మీసాలు తిప్పుతారు: కొండా మురళిపై చల్లా ధర్మారెడ్డి విమర్శలు

Challa Dharma Reddy fires on Konda Murali
  • పరకాలలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దన్న ధర్మారెడ్డి
  • ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో చేస్తోందని వ్యాఖ్య
  • ధరణి పోర్టల్ అత్యద్భుతమని కితాబు
కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శలు గుప్పించారు. పరకాల ఎంతో ప్రశాంతంగా ఉందని... ఇక్కడున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయవద్దని అన్నారు. చేతకాని వ్యక్తులే మీసాలు తిప్పుతారని, తొడలు కొడతారని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో చేస్తోందని అన్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండటాన్ని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అత్యద్భుతమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు పాలించిందని... ఏనాడూ 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను ఎవరూ వినొద్దని ప్రజలకు సూచించారు.   

Go Back to Shorts
Challa Dharma Reddy
BRS
Konda Murali
Congress

More Telugu News