సోనియా గాంధీని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి
- ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లుపై ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్న
- వివిధ ముఖ్య జాతీయ అంశాల్లో మహిళా బిల్లు ఎందుకు లేదని నిలదీత
- కాంగ్రెస్‌కు మహిళా బిల్లుపై చిత్తశుద్ధి లేదని విమర్శ
తొమ్మిది అంశాలతో పాటు మహిళా బిల్లును పొందుపర్చకపోవడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని ప్రశ్నిస్తూ.. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళా బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.