బీజేపీ నుంచి 4 నియోజకవర్గాలకు దరఖాస్తు చేసిన సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి
- మహేశ్వరం, ఎల్బీనగర్, ముషీరాబాద్, సనత్ నగర్‌ల నుండి ఆసక్తి కనబరిచిన శ్రీవాణి
- బీజేపీ తరఫున పోటీ చేసేందుకు మొదటిరోజే 182 దరఖాస్తులు
- ఎల్బీ నగర్ టిక్కెట్ కోసం సామ రంగారెడ్డి, వేములవాడ నుండి తుల ఉమ ఆసక్తి
సరూర్ నగర్ కార్పొరేటర్‌గా ఉన్న ఆకుల శ్రీవాణి నాలుగు నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, ముషీరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుండి పోటీకి ఆసక్తి కనబరుస్తూ ఆమె దరఖాస్తు ఇచ్చారు. ఎల్బీ నగర్ టిక్కెట్ కోసం సామ రంగారెడ్డి దరఖాస్తు ఇచ్చారు. వేములవాడ నుండి తుల ఉమ ఆసక్తి చూపారు. మొదటి దరఖాస్తు సికింద్రాబాద్ నుండి హరిప్రసాద్ గౌడ్ ఇచ్చారు.