అంగళ్లు, పుంగనూరు ఘటనలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
- ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త ఘటనలు
- టీడీపీ నేతలపై కేసులు
- ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు
- టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు పెట్టగా, నాలుగు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.