ఢిల్లీలో షర్మిల.. బెంగళూరుకు రేవంత్ రెడ్డి.. టీ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు!
- నిన్న ఉదయం అకస్మాత్తుగా బెంగళూరు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు
- డీకే శివకుమార్‌తో భేటీ అయ్యే అవకాశం
- రేపు గాంధీభవన్‌లో పీఈసీ సమావేశం
ఓవైపు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మలను పార్టీలోకి రావాలంటూ రేవంత్‌తో పాటు పొంగులేని శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. రేపు గాంధీభవన్‌లో పీఈసీ సమావేశం జరగనుంది.
ఆ తర్వాత ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ బెంగళూరు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసిన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో డీకే శివకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ బెంగళూరు టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.