పాపం ఇమ్రాన్ ఖాన్... జైలు నుంచి విడుదలైన గంటలోపే మళ్లీ అరెస్ట్!
- తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ కు ఊరట
- ట్రయల్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేసిన హైకోర్టు
- జైలు నుంచి ఇమ్రాన్ విడుదల
- తాజాగా అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్ట్
- రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం
ప్రధానిగా ఉన్న సమయంలో రాజకీయ లబ్ది కోసం రహస్యంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తోష్ ఖానా కేసు నుంచి ఊరట లభించిందని సంబరాలు చేసుకునే లోపే మరో కేసులో అరెస్ట్ చేయడం ఇమ్రాన్ మద్దతుదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది.