ఎన్టీఆర్ పేరు మీద చెల్లని నాణేన్ని విడుదల చేశారు: ఏపీ మంత్రి కారుమూరి
- ఎన్టీఆర్ ముఖచిత్రంతో రూ.100 నాణేలు
- ఆ నాణేలు ప్రజల్లో చలామణీ అయ్యేలా ఉండాలన్న మంత్రి
- ఎన్టీఆర్ మంచి నేత అని వెల్లడి
- నిన్న ఎన్టీఆర్ వెన్నుపోటుదారులందరూ ఒక్కచోట చేరారని వ్యాఖ్యలు
ఎన్టీఆర్ పేరు మీద చెల్లని నాణేన్ని విడుదల చేశారని విమర్శించారు. దివంగత నందమూరి తాకర రామారావు మంచి నేత అని, ఆయన పేరు మీద ముద్రించిన నాణేలు ప్రజల్లో చలామణీ అయ్యేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
నిన్న నాణెం ఆవిష్కరణ కార్యక్రమం చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వాళ్లందరూ ఒక్కచోట చేరినట్టు అనిపించిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని పిలవకపోవడం ఏంటని మంత్రి కారుమూరి ప్రశ్నించారు.