జన, కుల గణనపై అధికారం మాదే: కేంద్రం
- వేరే ఎవ్వరికీ ఈ అధికారం లేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్
- బీహార్ లో నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై సుప్రీంలో పిటిషన్
- ఇది కేంద్ర పరిధిలోని అంశమని అఫిడవిట్ లో స్పష్టం చేసిన హోంశాఖ
జన గణన అంశం రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర జాబితాలో వుందని తెలిపింది. బీహార్‌లో కులగణనకు పాట్నా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ సందర్భంగా తమ రాష్ట్రంలో కుల గణనకు సంబంధించిన సర్వేలను ఆగస్టు 6 నాటికి నిర్వహించి, ఆగస్టు 12 నాటికి సేకరించిన డేటాను అప్‌లోడ్ చేసినట్లు బీహార్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. కులాల వారీ సర్వే వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని చెప్పింది.