కోహ్లీని హెచ్చరించిన బీసీసీఐ
- యోయో టెస్ట్ స్కోరును సోషల్ మీడియాలో షేర్ చేసిన కోహ్లీ
- జట్టు సమాచారాన్ని బహిర్గతం చేయవద్దన్న బీసీసీఐ
- మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరిక
ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. దీంతో జట్టు సభ్యుల కోసం బెంగళూరులో శిక్షణా శిబిరాన్ని బీసీసీఐ నిర్వహిస్తోంది. టీమ్ సభ్యులకు ఫిట్ నెస్ టెస్ట్ (యోయో) నిర్వహించింది. యోయో టెస్టులో తనకు 17.2 స్కోరు వచ్చినట్టు కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీసీసీఐ నిర్దేశించిన స్కోరు 16.5ని అధిగమించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ అసహనం వ్యక్తం చేసింది. జట్టు అంతర్గత వివరాలను బహిరంగ పరచొద్దని ఆటగాళ్లను హెచ్చరించింది.