బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మా పార్టీలోనే ఉంది: బీజేపీ నేత లక్ష్మణ్
- సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ తొలి జాబితా ఉంటుందన్న లక్ష్మణ్
- వచ్చే ఎన్నికల్లో అవసరమైనచోట సీనియర్లు బరిలో ఉంటారన్న లక్ష్మణ్
- బీఆర్ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చలేదన్న బీజేపీ నేత
డబ్బున్నవారికి, అవినీతిపరులకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిందన్నారు. బీజేపీ జాబితా వస్తుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆదరాబాదరాగా అవినీతిపరులైన సిట్టింగ్‌లతో జాబితాను ప్రకటించారన్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చలేదంటే డొల్లతనం బయటపడుతోందన్నారు. తాము మాత్రం షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.