మెగా హీరో చిత్రం విడుదల వాయిదా.. కారణం ఏంటంటే..!
- వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఆదికేశవ
- శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా
- నవంబర్ 10న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను షేర్ చేసింది. ఇటీవలే ప్యారిస్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా కొంత భాగం చిత్రీకరణ మిగిలింది. దాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ రుద్ర కాళేశ్వర్ రెడ్డి పాత్రలో మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.