మిడ్ మానేరు జలాశయంలో బోటు నడిపిన కేటీఆర్... వీడియో ఇదిగో!

KTR drives a boat in Mid Maneru Reservoir
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
  • మిడ్ మానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్ ప్రారంభం
  • మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్
  • అనంతరం బోటులో ప్రయాణిస్తూ ఆస్వాదించిన వైనం
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మిడ్ మానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్ ను ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ బోటింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. బోటులో ప్రయాణిస్తూ మిడ్ మానేరు జలాశయం అందాలను వీక్షించే సదుపాయం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 

కాగా, ప్రారంభోత్సవం అనంతరం, మంత్రి కేటీఆర్ ఓ బోటులో ప్రయాణిస్తూ స్టీరింగ్ ను తన చేతుల్లోకి తీసుకున్నారు. బోటును నడుపుతూ ఆస్వాదించారు. ఆ సమయంలో మంత్రివర్గ సహచరుడు శ్రీనివాస్ గౌడ్.. కేటీఆర్ పక్కనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Go Back to Shorts
KTR
Boat
Mid Maneru
Inauguration
Rajanna Sircilla District
BRS
Telangana

More Telugu News