Kishan Reddy: దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారు: కిషన్ రెడ్డి

BRS MLAs taking commissions in Dalit Bandhu says Kishan Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో దళితబంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాకర్టీ కడతామని కేసీఆర్ కుటుంబసభ్యులు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని... మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు. 

పోలీసు అధికారులు వారి కనుసన్నల్లో పని చేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన అజయ్ ఇంత సంపదను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను కూడా అజయ్ వేధిస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
BJP
KCR
BRS

More Telugu News