చంద్రబోస్ సాహిత్యం - గీతామాధురి ఆలాపన: 'ఉమాపతి' నుంచి ఐటమ్ సాంగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబోస్ సాహిత్యం - గీతామాధురి ఆలాపన: 'ఉమాపతి' నుంచి ఐటమ్ సాంగ్!

Umapathi movie song released
  • విడుదలకు రెడీ అవుతున్న 'ఉమాపతి'
  • తమిళంలో హిట్ మూవీకి ఇది రీమేక్
  • సంగీతాన్ని అందించిన శక్తికాంత్ కార్తీక్ 
  • దర్శకుడిగా సత్య ద్వారంపూడి పరిచయం 
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతిని కలిగించేలా ‘ఉమాపతి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో 'అనురాగ్' హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ 'అవికా గోర్' హీరోయిన్ గా నటిస్తోంది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కోటేశ్వర రావు నిర్మిస్తుండగా, సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా కోసం 'నాకొకటి .. నీకొకటి ..' అంటూ సాగే ఈ మాస్ పాటను చంద్రబోస్ రాశారు. ఆయన చేతుల మీదుగానే కాసేపటి క్రితమే ఈ పాటను రిలీజ్ చేయించారు. ఈ పాటను గీతామాధురి ఆలపించారు. పల్లెటూరి వాతావరణం .. రికార్డింగ్ డ్యాన్సులు ..  ఆ పాటలో వేసిన సెట్లు అన్నీ కూడా బాగున్నాయి. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన అందించిన ఈ బాణీ ఎంతో క్యాచీగా ఉండటంతో, పాట ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది" అని అన్నారు. 
 
తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'కలవాని' సినిమాను తెలుగులో 'ఉమాపతి' అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. పోసాని కృష్ణమురళి ..  తులసి .. ప్రవీణ్ .. ఆటో రాంప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement
Avika Gor
Anurag
Umapathi
Chandrabose

More Telugu News