నేడు వైఎస్ వివేకా జయంతి.. సమాధి వద్ద నివాళి అర్పించిన సునీత, రాజశేఖర్ రెడ్డి
- నేడు వివేకా 72వ జయంతి
- పులివెందులలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన సునీత
- తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని వ్యాఖ్య
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, తన తండ్రి హత్య కేసులో విచారణ కొనసాగుతోందని, సీబీఐ అధికారులు వారి పని వారు చేస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ఇంతకు మించి కేసు గురించి తాను మాట్లాడలేనని చెప్పారు. తన తండ్రి బతికి ఉంటే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేవారమని చెప్పారు.