X ray: ఎక్స్ రే చూసి మధుమేహం వచ్చే అవకాశాలను చెప్పేయొచ్చు!

your X rays can help you diagnose diabetes early
షార్ట్స్‌లో చూడండి
రక్త పరీక్ష, లేదంటే మూత్ర పరీక్ష మధుమేహం (షుగర్, చక్కెర వ్యాధి) ఉందా, లేదా అని నిర్ధారించే విధానాలు. మరి ఎక్స్ రే ద్వారా ఎలా నిర్ధారిస్తారు? నిజమే. ఛాతీ ఎక్స్ రే చూసి మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది చెప్పవచ్చని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 2010 నుంచి 2021 మధ్య తీసిన 2.7 లక్షల ఎక్స్ రే ఫిల్మ్ ల ఆధారంగా అమెరికా పరిశోధకులు ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ను అభివృద్ధి చేశారు. ఈ టూల్ సాయంతో ఆ తర్వాత తీసిన 15,000 ఎక్స్ రేలను పరీక్షించి చూశారు. మధుమేహం రిస్క్ ను ఈ ఏఐ ప్రోగ్రామ్ గుర్తించి హెచ్చరించింది. భవిష్యత్తులో డయాబెటిస్ వస్తుందా? లేక మధుమేహం ఆరంభంలో ఉందా? అన్నది కూడా చెబుతుంది.

నిజానికి ఛాతీ ఎక్స్ రే కంటే రక్త పరీక్ష ద్వారా డయాబెటిస్ ఉందా? లేదా చూడడం సులభం. కానీ, ఇతర ఆరోగ్య సమస్యల కోసం చెస్ట్ ఎక్స్ రే తీసుకున్నప్పుడు దాని ద్వారా భవిష్యత్ మధుమేహం ముప్పును తెలుసుకోవడం ఎంతో అనుకూలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. దేశంలో 50 శాతం మధుమేహం కేసులు గుర్తించకుండా ఉంటున్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ‘‘ఈ ఇమేజెస్ లో ఎంతో డేటా ఉంటుంది. కానీ, ఆ మొత్తాన్ని సాధారణంగా గుర్తించడం కష్టం. ఏఐ వంటి టూల్ అధిక రిస్క్, శ్రమ, ఖర్చు లేకుండా గుర్తించడం ఎంతో అనుకూలం’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ షికాగో ప్రొపెషర్ అయిస్ పైరోస్ పేర్కొన్నారు.
Go Back to Shorts
X ray
diagnose
diabetes
early

More Telugu News