వింగ్స్ కంపెనీ నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ధర రూ. వెయ్యి లోపే!
- టచ్ కంట్రోల్, ఐపీఎక్స్ 5 రేటింగ్ సహా అత్యాధునిక ఫీచర్లు
- నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో తయారీ
- రూ.899 లకే వీటిని సొంతం చేసుకోవచ్చు అంటున్న కంపెనీ
సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ బడ్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశామని, అయితే నాణ్యత, ఫీచర్ విషయంలో మాత్రం రాజీ పడలేదని కంపెనీ తెలిపింది. ఇందులో 13ఎంఎం హై-ఫిడిలిటీ డ్రైవర్ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. టచ్ కంట్రోల్ తో పనిచేయడం వీటి ప్రత్యేకత అని వివరించింది. దీంతో పాటు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కూడా ఈ ఇయర్ బడ్స్ లో పొందుపరిచినట్లు తెలిపింది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఐపీఎక్స్ 5 రేటింగ్ తో వీటిని తయారు చేసినట్లు పేర్కొంది.