కనిపించని నీడ.. హైదరాబాద్ లో జీరో షాడో డే
- ఆగస్ట్ 3న మధ్యాహ్నం 12.23 గంటలకు
- నేలపై కనిపించని నీడలు
- సామాజిక మాధ్యమాల్లోకి చేరిన ఫొటోలు
ఈ దృశ్యం తరచుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటలకు హైదరాబాద్ లోనూ జీరో షాడో దృశ్యాలు కనిపించాయి. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో భూమి అక్షాంశం ఈ పరిణామానికి దారితీస్తుంది. ప్రజలు ఒకరికొకరు చేతులు కలిపి వృత్తాకారంలో నించుని ఫొటోలు తీసుకోవడమే కాకుండా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం కనిపించింది.