మొత్తానికి కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. కండువా కప్పిన ఖర్గే
- జూపల్లితోపాటు కాంగ్రెస్‌లో చేరిన కూచుకుళ్ల, మెగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి
- పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన జూపల్లి చేరిక
- హాజరైన రేవంత్, ఉత్తమ్‌కుమార్, కేసీ వేణుగోపాల్ తదితరులు
వాస్తవానికి జూపల్లి గత నెల 20నే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా అప్పటి నుంచి ఇది వాయిదా పడుతూ వస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని జూపల్లి భావించారు. భారీ వర్షాల కారణంగా అది రద్దయింది. ఆ తర్వాత గత నెల 30న మరో ముహూర్తం ఖరారు చేసినా అది కూడా వాయిదా పడింది. చివరికి నిన్న చేరాలని భావించి ఢిల్లీ వెళ్లినా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో కుదరలేదు. చివరికి ఈ ఉదయం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.