నాలుగేళ్ల పాటు పళ్లు, మొలకెత్తిన గింజలు మాత్రమే తిన్న మహిళ మృతి
- రా వీగన్ డైట్ ఫాలో అవుతున్న రష్యా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జానా డీఆర్ట్
- ఆసియా పర్యటనలో అనారోగ్యం పాలై జులై 21న మృతి
- కలరా లాంటి వ్యాధి సోకి జానా మరణించిందని ఆమె తల్లి వెల్లడి
- వండని ఆహారం శరీరానికి హానికరమంటున్న వైద్యులు
కాగా, జానా గత నాలుగేళ్లగా పచ్చి శాకాహారంపైనే ఆధార పడింది. పళ్లు, మొలకెత్తిన సన్‌ఫ్లవర్ గింజలు, పళ్ల రసాలే ఆహారంగా తీసుకునేది. ఫలితంగా చివరి రోజుల్లో ఆమె శరీరం ఎముకల పోగులా మారింది. చివరకు ఆరోగ్యం క్షీణించి మరణించింది.
అయితే, వండని ఆహారం శరీరానికి మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. పళ్లు, మొలకెత్తిన గింజలు పచ్చిగా తిన్నప్పటికీ ఇలాంటి వండని శాకాహారం శరీరానికి హానికరమని వైద్యులు కూడా చెబుతారు. వండిన ఆహారాన్ని తింటే పేగుల్లో రక్త ప్రసరణ మెరుగై ఆహారం త్వరగా జీర్ణమవుతుందట. అంతేకాకుండా, వండిన ఆహారం కడుపులో త్వరగా జీర్ణమవుతుంది.
జానా మరణానికి కారణమైన రా వీగన్ డైట్‌ను ఫాల్లో అయేవాళ్లు పచ్చి కూరగాయలు, పళ్లు, విత్తనాలు, మొలకెత్తిన గింజలు, దుంపలు మాత్రమే తింటారట. ఇక వండుకోవాల్సి వస్తే చాలా పరిమతమైన వేడిలోనే ఆహారాన్ని వేడి చేసుకుని తింటారట. ఈ డైట్‌తో ఆరోగ్యానికి గొప్ప మేలు జరుగుతుందన్న భావన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.