చెల్లెమ్మ పురందేశ్వరి కాకి లెక్కలు చెబుతోంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy slams Purandeswari
  • ఇటీవల ఏపీ బీజేపీ సారథ్యం అందుకున్న పురందేశ్వరి
  • వైసీపీ ప్రభుత్వంపై చిన్నమ్మ విమర్శల దాడి
  • గాలిమాటలెందుకంటూ విజయసాయిరెడ్డి ఫైర్
  • బావ కళ్లలో ఆనందం కోసం కాదమ్మా... ఉన్న పార్టీ కోసం పనిచేయాలని హితవు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితురాలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందుకోవడం ఆలస్యం... నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, పురందేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీకి నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదంటూ గాలి మాటలెందుకు? అంటూ ఘాటుగా బదులిచ్చారు. పార్లమెంటులో ఆర్థికమంత్రి స్వయంగా ప్రకటించినా గానీ, చెల్లెమ్మ పురందేశ్వరి ఏవో కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. 

"ఈ నాలుగేళ్లలో మీరు ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం. బావ కళ్లలో ఆనందం కోసం కాదమ్మా... ప్రస్తుతం ఉన్న పార్టీ కోసం పనిచేయొచ్చు కదా!" అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Daggubati Purandeswari
YSRCP
BJP
Andhra Pradesh

More Telugu News