ఏపీ బీజేపీ ఇన్ఛార్జీగా బండి సంజయ్ అంటూ ప్రచారం!
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్
- జాతీయ కార్యవర్గం నుంచి సునీల్ దేవధర్ తొలగింపు
- ఏపీ ఇన్ఛార్జీగా సునీల్ స్థానంలో సంజయ్ ను నియమిస్తారంటూ ప్రచారం
ఏపీ బీజేపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమించబోతున్నారనేదే ఆ ప్రచారం. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జీగా ఉన్న సునీల్ దేవధర్ ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఆయన స్థానంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జీగా మరో నాయకుడిని నియమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది.
ఏపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమిస్తే... వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ బలం పెరుగుతుందనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.