Advertisement

గురిపెట్టిన గన్స్ ముందు కూల్ గా బిగ్ బుల్ .. 'డబుల్ ఇస్మార్ట్' నుంచి సంజయ్ దత్ ఫస్టులుక్!

Double Ismart Movie Update
  • రామ్ హీరోగా రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్'
  • పూరి దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా 
  • ముంబై నేపథ్యంలో నడిచే కథ 
  • 'బిగ్ బుల్' పాత్రలో సంజయ్ దత్ 
  • మార్చి 8వ తేదీన సినిమా విడుదల
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు హీరోలను ఎదుర్కునే విలన్ గా కనిపించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇక్కడ విలన్ గా జాకీష్రాఫ్ కొంతకాలం క్రితమే రంగంలోకి దిగగా, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అదే బాటలో ముందుకు వెళుతున్నాడు. సంజయ్ దత్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆయన విలన్ గా చేస్తున్న సినిమానే 'డబుల్ ఇస్మార్ట్'. 

కొంతకాలం క్రితం పూరి తన సొంత బ్యానర్లో రామ్ హీరోగా హిట్ కొట్టిన 'ఇస్మార్ట్ శంకర్'కి ఇది సీక్వెల్. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారు. ఆయన పాత్ర పేరే 'బిగ్ బుల్'. ఆ పాత్రకి సంబంధించిన ఆయన లుక్ ను కొంతసేపటి క్రితం వదిలారు. సూటు .. చెవి రింగ్ .. పచ్చబొట్టుతో ఈ పోస్టర్ లో సంజయ్ దత్ చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. 

ఆయనను గన్స్ తో కొంతమంది టార్గెట్ చేసినట్టుగా అందుకు సంబంధించిన లేజర్ పాయింట్స్ ఆయన శరీరంపై కనిపిస్తున్నాయి. అయినా ఆయన చాలా కూల్ గా ఖరీదైన చుట్ట కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ రోల్ పై అందరిలో ఆసక్తిని పెంచుతున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమా, మార్చి 8వ తేదీన .. 'మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Ram
Sanjay Dutt
Puri Jagannadh
Double Ismart

More Telugu News