మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసు సీబీఐ చేతికి!
- వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం
- కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం!
కేసు విచారణను కూడా మణిపూర్ బయట చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. అసోంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణను చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు, మణిపూర్ లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోంశాఖ మెయితీలు, కుకీలతో సంప్రదింపులు జరుపుతోంది. చర్చలు పురోగతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.