నిర్మలా సీతారామన్ తో భేటీ విజయవంతంగా జరిగింది: పురందేశ్వరి

Purandeswari said meeting with Nirmala Sitaraman went successfully
  • ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్
  • ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని నిర్మలకు తెలిపిన పురందేశ్వరి
  • ఆ భారం ప్రజలపై మోపుతున్నారని వెల్లడి
  • నిర్మలకు వినతిపత్రం అందజేత
ఏపీ బీజేపీ చీఫ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పురందేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. "ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిధుల మళ్లింపును నిర్మల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం విచక్షణ రహితంగా అప్పులు చేసి, ఆ భారాన్ని రాష్ట్రంపై, ప్రజలపై మోపుతున్న వైనాన్ని ఆమెకు వివరించాను. నిర్మలా సీతారామన్ ను నేను కలిసిన ఉద్దేశం నెరవేరింది" అని పురందేశ్వరి పేర్కొన్నారు.
Go Back to Shorts
Daggubati Purandeswari
Nirmala Sitharaman
BJP
Andhra Pradesh
India

More Telugu News