విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఐటీహెచ్ విద్యార్థి
- ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న కార్తీక్
- ఈ నెల 17న క్యాంపస్ నుంచి అదృశ్యం
- సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ వెళ్లినట్టు గుర్తింపు
- ఈ ఉదయం సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు
రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ వెళ్లినట్టు గుర్తించారు. అతడి కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. చివరికి ఈ ఉదయం సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభ్యమైంది. సముద్రంలోకి దూకి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.