కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శంషాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు
- బాటసింగారంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తుండగా అడ్డగింత
- ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే వాహనాలు అడ్డుపెట్టి కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు
- వర్షంలో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కిషన్ రెడ్డి, రఘునందన్
కేంద్రమంత్రిని అయిన తనను ఎలా అడ్డుకుంటారని సీపీ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగారు. రఘునందన్, ఇతర నేతలతో కలిసి వర్షంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. బాటసింగారం వెళ్లి తీరుతానని చెప్పారు. అయితే, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.