ముంబైలో ఇక వీధి కుక్కలకూ ఐడీ కార్డులు..!
- ముంబైలోని పాఫ్రెండ్ స్వచ్ఛంధ సంస్థ కొత్త కార్యక్రమం
- ఐడీ కార్డుతో వీధి కుక్కలతో వచ్చే సమస్యలు తొలగుతాయని వెల్లడి
- కుక్క వయసు, ఎన్ని పిల్లలు వివరాలతో కార్డు జారీ
మనుషుల్లాగే వీది కుక్కలకూ ఓ ఐడీ కార్డు ఉండాలని ముంబైకి చెందిన ఇంజినీర్ అక్షయ్ రిడ్లాన్ భావించారు. తన ఆలోచనను pawfriend సంస్థతో పంచుకున్నారు. సంస్థ నిర్వాహకులకూ ఈ ఆలోచన నచ్చడంతో అందరూ కలిసి కార్యరంగంలోకి దిగారు. స్థానికులకు వీధి కుక్కల నుంచి ఎదురయ్యే సమస్యలను ఈ క్యూఆర్ కోడ్‌తో కొంత వరకూ పరిష్కరించవచ్చని తెలిపారు. తొలుత విమానాశ్రయం సమీపంలోని కొన్ని వీధి కుక్కలకు వీటిని జారీ చేశారు. ముంబైలోని వీధి కుక్కలన్నిటికీ ఈ కార్డులు ఇవ్వాలనేదే తమ సంకల్పమని చెప్పారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారూ ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. కుక్కలకు క్యూఆర్ కోడ్ ఇచ్చేముందు వాటికి వ్యాక్సినేషన్ చేస్తోంది