NDA, INDIA రెండు కూటముల్లో చేరని 11 పార్టీలు ఇవే.. తటస్థంగా ఉన్న 91 మంది ఎంపీలు!
- ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- ఎన్డీయేలో 39 పార్టీలు, ఇండియా కూటమిలో 26 పార్టీలు
- తటస్థంగా ఉన్న వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ
ఇంకోవైపు ప్రస్తుతం ఉన్న ఎన్డీయే, ఇండియా కూటముల్లో 65 పార్టీలు ఉన్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలు, ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. 11 పార్టీలు మాత్రం ఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్నాయి. వీటిలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎంలతో పాటు బిజూ జనతాదళ్, బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (ఎస్), ఏఐయూడీఎఫ్, ఆర్ఎల్పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్) ఉన్నాయి. ఈ పార్టీలకు 91 మంది ఎంపీల బలం ఉంది.