Rajinikanth: ‘టైగర్ కా హుకుం’ అంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్

Rajinikanth Jailer Second Single from 17th July
షార్ట్స్‌లో చూడండి
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజే వేరు. ఆయన స్టైల్ కు కోట్లాది మంది అభిమానులున్నారు. వయసు మీదపడ్డా అభిమానుల కోసం ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో చిత్ర బృందం ప్రమోషన్లు కూడా ప్రారంభించింది. ఈ సినిమా నుంచి తమన్న నర్తించిన ‘నువ్వు కావాలయ్యా’ అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేసింది. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌ తో పాటు సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ తో దూసుకెళ్తోంది. 

అదే జోరులో ఈ సినిమా నుంచి రెండో పాటకు ముహూర్తం పెట్టారు.  ‘హుకుం’ అనే పాటను సోమవారం విడుదల చేయనున్నట్టు ఓ ప్రోమోను వదిలారు. ఇందులో ‘ఏయ్ ఇక్కడ నేనే కింగ్. నేను చెప్పేవే రూల్స్. రూల్స్ తప్పితే ఎవర్నీ వదిలిపెట్టను. ఇది హుకుం.. టైగర్‌‌ కా హుకుం’ అంటూ రజనీకాంత్ తన దైన స్టైల్, స్వాగ్‌ లో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దాంతో, ఈ పాటపైనా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 10వ తేదీన పలు భాషల్లో  ఈ సినిమా విడుదల కానుంది. తమన్నాతో పాటు మోహన్‌లాల్‌, శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్, నాగబాబు, సునీల్, రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటించారు.
Go Back to Shorts
Rajinikanth
Jailer moivie
hukum
song
Tamannaah

More Telugu News