టీపీసీసీ ప్రచార కమిటీని ప్రకటించిన కాంగ్రెస్.. పొంగులేటికి కీలక పదవి!

TPCC Campaign Committee
  • నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
  • కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీ.. కోఛైర్మన్ గా పొంగులేటి
  • ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా 37 మంది నియామకం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశం లభించినా దాన్ని ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీని పార్టీ హైకమాండ్ నిన్న రాత్రి ప్రకటించింది. 

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీని నియమించారు. నెల రోజుల క్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవిని అప్పగించారు. ప్రచార కమిటీ కోఛైర్మన్ గా ఆయనను నియమించారు. కన్వీనర్ గా సయ్యాద్ అజ్మతుల్లా హుస్సేనీని ప్రకటించారు. మరో 37 మందిని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమించారు. పీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, శాసనమండలిలో పార్టీ నేత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాలు, శాఖలు, సెల్స్ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు. 

టీపీసీసీ ప్రచార కమిటీ పూర్తి జాబితా:
Go Back to Shorts
TPCC
Campaign Committee
Ponguleti Srinivas Reddy

More Telugu News