పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా సేవ చేస్తా: పాలేరులో షర్మిల
- ఇడుపులపాయ నుండి పాలేరుకు వైఎస్ షర్మిల
- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ సేవలతో వైఎస్ పాలన తీసుకువస్తానని వ్యాఖ్య
- త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభిస్తానని వెల్లడి
రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలతో దివంగత ముఖ్యమంత్రి పాలనను తీసుకు వస్తానని చెప్పారు. నేను మళ్లీ చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు. రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాట ఇస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, త్వరలో మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి ఇక్కడే ముగిస్తానన్నారు.