రేపు జగన్, షర్మిల వేర్వేరుగా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు!
- ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల
- ఉదయం తల్లితో కలిసి వైఎస్ ఘాట్ వద్ద నివాళులు
- మధ్యాహ్నం గం.1.55కు వైఎస్ ఘాట్ వద్దకు రానున్న జగన్
జగన్ మధ్యాహ్నం గం.1.55 సమయానికి ఇడుపులపాయకు చేరుకొని నివాళులర్పిస్తారు. ప్రతి సంవత్సరం వీరిద్దరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం వేర్వేరు సమయాల్లో హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా, షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఈ ప్రచారానికి ఇడుపులపాయ సాక్షిగా ఆమె తెరదించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.