వింబుల్డన్ లో జకోవిచ్ శుభారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వింబుల్డన్ లో జకోవిచ్ శుభారంభం

Djokovic makes good start in Wimbledon
  • నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ
  • రెండో రౌండ్లోకి దూసుకెళ్లిన జకోవిచ్
  • పెడ్రో కాచిన్ పై వరుస సెట్లలో నెగ్గిన సెర్బ్ వీరుడు
  • మహిళల సింగిల్స్ లో టాప్ సీడ్ ఇగా స్వైటైక్ ముందంజ
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి మాంచి ఊపుమీదున్న వరల్డ్ నెంబర్ 2 నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో శుభారంభం చేశాడు. అర్జెంటీనాకు చెందిన పెడ్రో కాచిన్ తో జరిగిన వింబుల్డన్ తొలి రౌండ్ పోరులో జకోవిచ్ 6-3, 6-3, 7-6 (7-4)తో వరుస సెట్లలో నెగ్గాడు. 

తొలి రెండు సెట్లలో ఏమాత్రం పోటీ ఇవ్వని కాచిన్... చివరి సెట్లో ప్రతిఘటించాడు. దాంతో ఆ సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. అయితే, జకోవిచ్ టైబ్రేకర్ లో విజృంభించడంతో కాచిన్ కు ఓటమితప్పలేదు. 

ఇక, మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ ఇగా స్వైటెక్ అలవోకగా తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. చైనాకు చెందిన జు లిన్ పై స్వైటెక్ 6-1, 6-3 తేడాతో విజయం సాధించింది. 

ఇతర తొలి రౌండ్ మ్యాచ్ ల్లో ఐదో సీడ్ కరోలిన్ గార్సియా 6-4, 6-3తో కేటీ వోలీనెట్స్ పై గెలిచింది.
Advertisement
Novak Djokovic
Wimbledon
1st Round
Pedro Cachin

More Telugu News