ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైనట్టే: గద్దర్
- నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ
- ఖమ్మం వచ్చిన గద్దర్
- కేసీఆర్ పాలనలో అడుగడుగునా నిర్బంధాలేనని వెల్లడి
- ప్రజలు ఆంక్షలను ఛేదించుకుని బయటికి రావాలని పిలుపు
ఈ సందర్భంగా గద్దర్ సీఎం కేసీఆర్ విధానాలను విమర్శిస్తూ అప్పటికప్పుడు పాట పాడారు. ఉపా కేసులు ఉన్నప్పటికీ తాను పాడటం మానేయలేదని స్పష్టం చేశారు.
కోరుకుంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరగలననని, కానీ ఇప్పటికే తాను గద్దర్ ప్రజా పార్టీ పేరిట ఓ పార్టీ స్థాపించానని ఆయన వెల్లడించారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని, ప్రజాస్వామిక పద్ధతిలో ఆ యుద్ధాన్ని ఓట్ల రూపంలోకి మలిచేందుకు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గద్దర్ సూచించారు.