హోటల్ లో భోజనం చేస్తున్న వారిపై పడ్డ క్షిపణి.. ధ్వంసమైన బిల్డింగ్.. వీడియో ఇదిగో!
- రష్యా దాడితో నేలమట్టమైన ఉక్రెయిన్ రెస్టారెంట్
- నలుగురు మృతి.. 42 మందికి గాయాలు
- బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయిన జనం
ఉక్రెయిన్ సిటీ క్రమటోర్స్క్ లోని ఫేమస్ రెస్టారెంట్ రియా లాంజ్ తో పాటు అక్కడికి దగ్గర్లోని ఓ షాపింగ్ సెంటర్ పైనా ఈ క్షిపణి దాడులు జరిగాయి. సాయంత్రం 7:30 గంటల (లోకల్ టైం) ప్రాంతంలో ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో రెస్టారెంట్ లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పారు. రెస్టారెంట్ లో దాదాపు 80 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని సమాచారం. అక్కడికి దగ్గర్లోని షాపింగ్ సెంటర్ పై జరిగిన దాడిలో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదని, 56 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.