నా గురించి పేపర్లో అలా రాయడంతో, ఆ నిర్మాత మందలించాడు: మురళీమోహన్
- ఒక తమిళ పేపర్ తన గురించి అలా రాసిందన్న మురళీమోహన్
- ఇండస్ట్రీలో ఆ వార్త గుప్పుమందని వెల్లడి
- ఈ విషయంలో తనని ఆ నిర్మాత మందలించారని వ్యాఖ్య
- తన భార్యాబిడ్డలు నమ్మలేదని వివరణ
అదే సమయంలో నా మొదటి సినిమా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారు నాకు కాల్ చేశారు. నేను ఆయనను గురువుగా భావిస్తూ ఉంటాను. ఎక్కడున్నావ్ అని అడిగితే వాహినీ స్టూడియోలో అని చెప్పాను. తాను బయల్దేరి వస్తున్నట్టుగా చెప్పడంతో, నాకు టెన్షన్ పట్టుకుంది. పేపర్లో వచ్చింది చూసి ఉంటాడా? అని అనుకుంటూనే ఉన్నాను.
'కొంతసేపటి తరువాత ఆయన వచ్చారు. 'బాబూ నీ గురించి నాకు తెలుసు. కానీ ఆకర్షణలో పడి ఏమైనా తప్పు చేస్తావేమోనని హెచ్చరించడానికి వచ్చాను. ఇవాళ పేపర్లో వచ్చింది గదా .. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను .. ఇలాంటి పిచ్చిపనులు చేయవద్దు' అన్నారు. ఆయనకి చెడ్డపేరు తీసుకొచ్చే ఏ పనీ చేయనని అన్నాను. అయితే పేపర్లో వచ్చిన ఈ వార్తను నా భార్యాబిడ్డలు నమ్మకపోవడం నాకు గర్వంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.