ఆ విషయం చంద్రబాబునే అడగండి.. సోము వీర్రాజు అసహనం
- కేంద్ర పథకాలను తనవిగా చెబుతున్న జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న వీర్రాజు
- కేంద్రం నిధులిస్తున్నా పోలవరం పూర్తిచేయడం లేదని మండిపాటు
- బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్తూరులో బహిరంగ సభ
అనంతరం విలేకరులతో వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు.