ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. వీడియో ఇదిగో!
- విధానసభలోని పశ్చిమ ద్వారాన్ని తెరిపించిన సిద్ధరామయ్య
- 1998 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ తలుపులకు తాళం వేయించిన అప్పటి సీఎం జేహెచ్ పటేల్
- వాస్తుదోషం కారణంగానే మూత
- మూఢనమ్మకాలను పాతిపెట్టేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఆ గేటును ఎవరు మూసేశారంటే?
విధానసౌధలోని ఈ తలుపులను 1998లో అప్పటి ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్ మూసివేయించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరాజయానికి కారణం ఈ ద్వారమేనని భావించి తాళాలు వేయించారు. 2013లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ తలుపులు తెరిపించారు. అయితే, ఆ తర్వాత 15 ఏళ్లలో ఆరుగురు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఎవరూ ఆ తలుపులు తెరిచే ప్రయత్నం చేయలేదు. బీజేపీ హయాంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప, బసవరాజు బొమ్మై, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఎవరూ కూడా ఆ తలుపులు తెరిపించే సాహసం చేయలేకపోయారు. కానీ, సిద్ధరామయ్య మాత్రం ఆ తలుపులు తెరిపించి తన చాంబర్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.