100 రోజుల మైలురాయి దాటిన భట్టి విక్రమార్క పాదయాత్ర
- మార్చి 16న ఆదిలాబాద్ లో ప్రారంభమైన యాత్ర
- నేటితో వంద రోజుల మార్కు దాటిన వైనం
- కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న భట్టి పాదయాత్ర
యాత్ర 100వ రోజు మార్కు చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. భట్టి పాదయాత్ర ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిలిపింది. నేతల మధ్య ఐక్యత తెచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రకు మంచి స్పందన రావడం హైకమాండ్ ను కూడా ఆకర్షించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు యాత్రలో పాల్గొన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.