చిరుత పిల్లతో బాలుడి ఆటలు.. వీడియో ఇదిగో!
- యూపీలోని ఓ మామిడి తోటలో ఘటన
- మొబైల్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్
- వైరల్ గా మారిన వీడియోపై అధికారులకు ఫిర్యాదు
- చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది
మీరట్ లోని షాజన్ పూర్ లోని ఓ మామిడి తోటలో చిరుత పిల్లతో ఓ బాలుడు ఆటలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నట్లు చిరుత పిల్లతో ఆడుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై మామిడితోట యజమాని ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. వెంటనే సిబ్బందిని పంపించి చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడితో పాటు అక్కడ ఉన్న మిగతా వారినీ ప్రశ్నించారు. దీనిపై మరింత విచారణ జరుపుతామని, చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.