అంతా బాగుందని డీజీపీతో సీఎం జగన్ చెప్పించడం సిగ్గుచేటు: జీవీఎల్
- ఇటీవల విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్
- బాపట్ల జిల్లాలో బాలుడి సజీవ దహనం
- సీఎం జగన్ పై ధ్వజమెత్తిన జీవీఎల్
- సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
రాష్ట్రంలో పరిస్థితులు సామాన్యులకు భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ, రాష్ట్రంలో శాంతిభద్రతలకు లోటు లేదని, అంతా బాగుందని డీజీపీతో సీఎం జగన్ చెప్పించడం సిగ్గుచేటని జీవీఎల్ మండిపడ్డారు.
అక్కను వేధిస్తుండడంతో అడ్డుకున్న ఆ బాలుడ్ని సజీవదహనం చేయడం రాక్షసులు కూడా సిగ్గుపడే చర్య అని అభివర్ణించారు. తన అక్క ఎదుర్కొంటున్న వేధింపులను ఒక చిన్న పిల్లవాడు అడ్డుకున్నాడని మీ కార్యకర్త పాశవిక చర్యకు పాల్పడడం చూస్తుంటే మీరు వారిలో ఏ స్థాయిలో రాక్షస మనస్తత్వాన్ని నింపారో అర్థమవుతోందని సీఎం జగన్ ను జీవీఎల్ విమర్శించారు. ఆ విద్యార్థి కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.