పాలు తాగట్లేదని 5 రోజుల పసికందుపై తల్లి దారుణం!
- ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామంలో వెలుగు చూసిన ఘటన
- అకస్మాత్తుగా తల్లిపాలు తాగడం మానేసిన శిశువు
- శిశువు వేళ్లను వేడి నూనెలో ముంచితే పరిస్థితి చక్కబడుతుందని ఆరోగ్య కేంద్రం సిబ్బంది సలహా
- ఈ సూచనను యథాతథంగా అమలు చేసిన తల్లి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరోగ్య కేంద్రం వైద్యుడు
సమస్యను పరిష్కరించేందుకు చిన్నారి వేళ్లను వేడి నూనెలో ముంచాలని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఒకరు దారుణమైన సలహా ఇచ్చారు. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. పుట్టిన కొన్ని రోజులకు పాలు తాగడం మానేసిన బిడ్డ ఆ తరువాత మృతి చెందింది. దీంతో, ఈ చిన్నారి కూడా తనకు దూరం అవుతుందనే భయంతో ఆసియా ఆ సలహాను యథాతథంగా పాటించింది. విధుల్లో ఉన్న ఓ నర్సు ఈ విషయాన్ని గుర్తించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వైద్యుడు చిన్నారికి వెంటనే వైద్యం అందించి, ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.