కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!
- 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచన
- అలా అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్‍లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయదని ఆఫర్
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సౌరభ్ భరద్వాజ్ విమర్శలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి గెలిస్తే దేశం నియంతృత్వంలోకి వెళ్లడం ఖాయమన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను ఉపయోగించి విపక్ష నేతలను జైల్లో పెట్టిస్తారని ఆరోపించారు.
సౌరభ్ భరద్వాజ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతోందన్నారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలను, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందన్నారు.