కేసీఆర్‌ను భరించే ఓపిక ఇక లేదు.. పాలించే అర్హతా లేదు: రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటం కాదన్న రేవంత్
- పదేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని ఆగ్రహం
- కేసీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్న రేవంత్
- 22 ఏళ్లు తెలంగాణ జెండామోసిన వారికి న్యాయం జరిగిందా? అంటూ ప్రశ్న
కేసీఆర్ పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అంటున్నారని, కానీ వీరు పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టారని ఆరోపించారు. 22 ఏళ్లు తెలంగాణ జెండామోసిన వారికి న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.