Ram Pothineni: త్వరలో రామ్ పోతినేని కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడా?

After Sharwanand and Varan Tej Ram Pothineni set to tie the knot
షార్ట్స్‌లో చూడండి
రామ్ పోతినేని పెళ్లి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఓ వ్యాపారవేత్త కుమార్తెను రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడన్నది ఈ వార్తల్లోని సారాంశం. దీనిపై అధికారంగా ఎలాంటి ప్రకటన, ధ్రువీకరణ ఇంత వరకు రాలేదు. తెలుగు పరిశ్రమలోని మిగిలి ఉన్న కొద్ది మంచి బ్రహ్మచారుల్లో రామ్ కూడా ఒకరు కావడంతో, అతని వివాహంపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అతని వివాహంపై గతంలోనూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. మరోసారి అతడి వివాహం అంశం తెరపైకి రావడంతో ఆసక్తి ఏర్పడింది.

రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ర్యాపో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మైసూరులో శ్రీ లీల, రామ్ మధ్య సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారు. ఈ ఫొటోలను శ్రీలీల తన ఇన్ స్టా పేజీలో షేర్ చేసింది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే నాగబాబు కుమారుడు, ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఖరారు కావడం తెలిసిందే. అంతేకాదు, రామ్ కజిన్ అయిన శర్వానంద్ రక్షితను జైపూర్ లో వివాహం చేసుకున్నాడు. మరి త్వరలో రామ్ పెళ్లి కబురు కూడా వస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
Ram Pothineni
marriage
rumours

More Telugu News