మెగాస్టార్ తో మరోసారి జోడీ కడుతున్న త్రిష!

Trisha in Chiranjeevi movie
  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ 
  • ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష
  • 'స్టాలిన్' తరువాత రిపీట్ అవుతున్న కాంబినేషన్  
  • ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సుస్మిత కొణిదెల నిర్మాత 
'భోళాశంకర్' తరువాత చిరంజీవి ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకరు వశిష్ఠ అయితే, మరొకరు కల్యాణ్ కృష్ణ. చిరంజీవితో సోషియో ఫాంటసీ చేయడానికి వశిష్ఠ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ కోసం కల్యాణ్ కృష్ణ ఒక విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఖరారు చేసుకున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. గతంలో ఆమె చిరంజీవి సరసన నాయికగా 'స్టాలిన్' సినిమాలో చేసింది . మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నారు. 'PS -1'లో త్రిష గ్లామర్ చూసిన వాళ్లంతా, మళ్లీ ఆమెకి తెలుగు నుంచి ఛాన్సులు వెళ్లడం ఖాయమని అనుకున్నారు .. అలాగే జరుగుతోంది కూడా. 

ఈ సినిమాలో చిరంజీవి తనయుడి పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన జోడీగా శ్రీలీలను దాదాపు ఖాయం చేసినట్టేనని చెబుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తన సొంత బ్యానర్లో చిరంజీవి కూతురు సుస్మిత నిర్మిస్తుండటం విశేషం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

Advertisement
Chiranjeevi
Trisha
Sreeleela
Susmitha

More Telugu News